Home తాజా వార్తలు నిఘానేత్రాల నీడలో…

నిఘానేత్రాల నీడలో…

cc-cameras

మహబూబ్‌నగర్: జడ్చర్ల, బాదేపల్లి పట్టణాలలోని ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాలను(సీసీకెమెరాలను) ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఒక కెమెరాను జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలోని ఫ్లైవర్ దగ్గర ఏర్పాటు చేసి ట్రయల్ చూస్తున్నారు. అదే విధంగా పట్టణాలలోని ప్రధాన కూడళ్లలో కూడా నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కూడళ్లలో ఏర్పాటు చేయడానికి వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులలో మొత్తం కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రాఫిక్‌ను పరిశీలించనున్నారు. జడ్చర్లలోని ఫ్లైవర్ దగ్గర రెండు కెమెరాలను, నేతాజిచౌక్, గాంధీచౌక్, నెహ్రుచౌరస్తా, అంభేద్కర్ కూడళిలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్ నుండే పట్టణంలోని ట్రాఫిక్‌ను పరిశీలించనున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వలన వాహన రాకపోకలు సాఫీగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ఆటోలు, మోటార్‌సైకిళ్లు ఇతర వాహనాలు రోడ్డుపై అడ్డుదిడ్డంగా వెళుతు పాదచారులకు, వాహదారులకు ఇబ్బందులు పెడుతున్నాయి. వాహన రాకపోకలను నిఘానేత్రం ద్వారా పోలీస్‌స్టేషన్ నుంచే పరిశీలించి ఏదైన వాహనం రోడ్డుపై నిలిపినా, లేదా ట్రాఫిక్ అయిన సందర్భంలో మోబైల్ పార్టీలకు సమాచారం అందించి అక్కడి వాహన రాకపోకలను పునరుద్దరించడం జరుగుతుంది. దీంతో ట్రాఫిక్‌జాం కాకుండా త్వరగా చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా రాత్రివేళలో, పగటిపూట చైన్ స్నాచింగ్‌తో పాటు పలు దొంగతనాలకు పాల్పడే వారిని ఈ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. .