Home జాతీయ వార్తలు బంగారం బాండ్లు

బంగారం బాండ్లు

ప్రతి ఒక్కరికి ఏటా 500 గ్రాముల పరిమితి

2,5,10 గ్రాముల బాండ్ల జారీ
బంగారానికి గిరాకీ తగ్గించే వ్యూహం

బాండ్ల జారీ అధికారం ఆర్‌బిఐకి

Arun-jaitly_manatelangana copyన్యూఢిల్లీ: బంగారం బాండ్లు, స్వర్ణ ద్రవ్యీకరణ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణ యం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరు ణ్ జైట్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు. భౌతి కంగా బంగారానికి డిమాండ్‌ను తగ్గించి, వాటి స్థా నంలో బాండ్లతో వడ్డీని అందివ్వాలనేది ఈ పథకం ముఖ్యోద్దేశం. దీనిలో భాగంగా బంగారం ధరకు స మానంగా 2, 5, 10 గ్రాముల పేరిట బాండ్లను ప్ర భుత్వం జారీ చేస్తుంది. పసిడికి బదులుగా అదే స్థా నంలో బంగారం బాండ్లను కొనుగోలు చేసే అవకా శం కల్పిస్తారు. బంగారం బాండ్లను ప్రభుత్వం తర ఫున రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. ఈ రెండు పథ కాలు సురక్షితం, ఆర్థికంగా మరింత స్థిరత్వం ఇస్తా యని కేబినెట్ సమావేశం తర్వాత జైట్లీ అన్నారు. బంగారం ధరల్లో మధ్యకాల ఒడిదుడుకులను నుం చి ఇన్వెస్టర్లకు భద్రత కల్పిస్తాయని అన్నారు. గోల్డ్ బాండ్ పథకం కింద ఒక వ్యక్తికి వార్షిక పరిమితి 500 గ్రాములు, ఈ బాండ్‌లను 5-7 సంవత్సరాల కాలపరిమితితో జారీ చేస్తారు. బంగారానికి ప్రత్యా మ్నాయంగా ఎస్‌జిబి(సావరిన్ గోల్డ్ బాండ్) పథకా న్ని ఆర్థిక ఆస్తిగా అభివృద్ధి చేయాలని బడ్జెట్ 2015-16లో ప్రతిపాదించారు. ‘ఇది నల్లధనం రో గ నిరోధక పథకం కాదు. సాధారణ పన్ను చట్టాలే వర్తిస్తాయి’ అని మంత్రి ఓప్రశ్నకు సమాధానమి చ్చారు. వార్షికంగా 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, ప్రతి ఏడాది ప్రజలు ఇన్వెస్ట్‌మెంట్ కోసమే ఇంత పరిమాణంలో బంగా రాన్ని తీసుకుంటున్నారని ఆయన అన్నారు. స్వర్ణ ద్రవీకరణ పథకం ద్వారా ప్రజలు వ్యర్థంగా పడివు న్న బంగారాన్ని అధికారిక సంస్థల్లో డిపాజిట్ చేసి, ధర పెరిగినప్పుడు ప్రయోజనంతో పాటు డిపాజిట్ల పై వడ్డీని పొందవచ్చని జైట్లీ వివరించారు.

నగుదు చెల్లింపుపై సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తారు. పసిడి ధర దీనికి అనుసంధానం అవుతుంది.

గోల్డ్ బాండ్‌లు భారతీయులకు పరిమితంగానే ఉంటాయి. ఎన్‌ఆర్‌ఐలకు ఈ బాండ్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశం లేదు.
ఈ గోల్డ్ బాండ్ కొనుగోలుపై నిబంధనలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఏడాదికి 500 గ్రాముల కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి చాన్స్ లేదు.
బంగారం 2, 5, 10 గ్రాముల పరిమాణాల్లో బాండ్‌లను జారీ చేస్తారు.
ఈ బంగారం బాండ్‌పై తాత్కాలిక వడ్డీ రేటు చెల్లింపు 2-3 శాతం స్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ బంగారం రుణాల రేటుకు ఈ వడ్డీ రేటు అనుసంధానించబడి ఉంటుంది. వడ్డీ చెల్లింపు బంగారం గ్రాముల ఆధారంగా ఉంటుంది.
బిలియన్ మార్కెట్ అసోసియేషన్, ఎన్‌సిడిఇఎక్స్ లేదా ఆర్‌బిఐ నుంచి బంగారం ధరను తీసుకుంటారు.
ప్రభుత్వం తరఫున బ్యాంకులు/ఎన్‌బిఎఫ్‌సిలు/ పోస్ట్ ఆఫీస్‌లు బాండ్‌లను జారీ చేస్తాయి.
బాండ్ మెచ్యూరిటీ వ్యవధి 5 నుంచి 7 ఏళ్లు. ఈ వ్యవధి వల్ల బంగారం ధరల్లో ఒడిదుడుకుల నుంచి ఇన్వెస్టర్లను రక్షించవచ్చు.
కమోడిటీ ఎక్సేంజ్‌పై బాండ్లను సులువుగా అమ్మొచ్చు, ట్రేడ్ చేయవచ్చు.
భౌతిక బంగారం మాదిరిగానే మూలధన రాబడి పన్ను ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్‌లు, కమిషన్ ఆధారంగా బ్రోకర్లు/ ఏజెంట్లు ద్వారా ఈ బాండ్‌ను మార్కెట్ చేస్తారు.

రత్నాలు, నగల రంగానికి ప్రోత్సాహకాలు అందించి, దేశీయ డిమాండ్‌ను అందుకునేందుకు బంగారం దిగుమతులపై విశ్వాసాన్ని తగ్గించి, ఇళ్లు, సంస్థలచే బంగారాన్ని సేకరించాలనేది లక్షం.

బ్యాంకుల్లో విలువ లోహాలను డిపాజిట్ చేయడం ద్వారా నగదు లేదా బంగారం యూనిట్లలో వడ్డీని పొందుతారు
ఖాతా ప్రారంభించిన 30/ 60 రోజుల తర్వాత వడ్డీని చెల్లిస్తారు
పథకం కింద కనీసం 30 గ్రాముల పసిడిని డిపాజిట్ చేయాలి
వడ్డీ ఆదాయంపై మూలధన రాబడి పన్ను, ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
వ్యక్తి లేదా సంస్థ మిగులు బంగారంపై బిఐఎస్ ఆమోదిత హాల్‌మార్క్ కేంద్రాల నుంచి విలువ పొందుతారు
బంగారం పొదుపు ఖాతాకు కనీస వ్యవధి ఒక సంవత్సరం
ప్రతి సంవత్సరానికి భారత్ దిగుమతులు దాదాపు 800 నుంచి 1000 టన్నులుగా ఉన్నాయి.
భారత్‌లో బంగారం నిల్వలు 20 వేల టన్నులకు పైగా ఉంటాయని అంచనా, ఈ బంగారమంతా ట్రేడ్ అవుతుందే తప్ప చలామణిలో లేదు.