Home తాజా వార్తలు రిజర్వేషన్లపై కేబినేట్ సబ్ కమిటీ భేటీ

రిజర్వేషన్లపై కేబినేట్ సబ్ కమిటీ భేటీ

Cabinet Sub Committee Meeting in Secretariat on BC Reservations

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రిజర్వేషన్లపై కేబినేట్ సబ్‌కమిటీ బుధవారం సమావేశమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, అడిషనల్ అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులు హాజరయ్యారు. బిసి రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో అపీల్ చేయనుంది. 61 శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని న్యాయస్థానానికి ప్రభుత్వం కోరనుంది.