Home తాజా వార్తలు రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Cabinet Sub Committee Meets on Ration Dealers Issues

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలపై గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. కిలో బియ్యంపై ఇస్తున్న కమిషన్ 20 పైసల నుంచి 70పైసలకు పెంచినట్టు ఆయన తెలిపారు. పెరిగిన ఈ కమిషన్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 2015, అక్టోబరు 1నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేశామని ఆయన వెల్లడించారు.

Cabinet Sub Committee Meets on Ration Dealers Issues