Search
Saturday 17 November 2018
  • :
  • :

కడెం పడవ ప్రయాణం పదిలమేనా?

boat2

నాటిబోటే నేటికి వినియోగం

బోట్‌లో ప్రయణించే వారికి రక్షణ 

దేవుడెరుగు
ఆదాయం బారెడు సౌకర్యాలు మూరెడు
ప్రమాదం జరిగితే తప్ప పట్టంచుకోరా?

మన తెలంగాణ/ఖానాపూర్ : నిర్మల్ జిల్లాలోని కడెం ఆందాలను వీక్షించాలంటే పడవ ప్రయాణం కనుల విందు చేస్తుంది. అందు కే పర్యాటకులు పడవ ప్రయాణం చేయకుండా వెనుదిరిగారు. తాము చేస్తున్న పడవప్రయాణం ప్రాణాలతో చలగాటం అన్న విషయం పర్యాటకులకు తెలియని విష యం. గత 9సం॥ క్రితం అప్పటి పర్యటక శాఖ ము ఖ్యకార్యదర్శి చందనఖాన్ కడెం ప్రాజెక్టును సందర్శుకుల సౌకర్యార్థం బోట్‌ను మంజూ రు చేశారు. చందనాఖాన్ మంజూరు చేసిన నాటిబోటే నేటికి ఉపయోగిస్తున్నారు. దానికి తోడు ఇటీవలే నలుగురితో ప్ర యాణించే ఒక స్పీడ్‌బోట్‌ను ఏర్పాటు చేశారు. పెద్ద పడవలో 18 మందికి కంటే ఎక్కువ పర్యాటకులను ఎక్కించుకోరాదు. కానీ బోట్ ను నిర్వాహకులు కక్కుర్తితో  ఒకేసారి 20 నుండి 30 మంది వరకు ఎక్కిస్తున్నారు. పడవలో విహరించే పర్యాటకులకు కచ్చితంగా రక్షణకవచాలు తొడగాలి. రక్షణకవచాలు చినిగి పోయాయి. నిర్వహకులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం లేదనే ఆరోపనాలు ఉన్నాయి. రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు కూడా వారంలో ఎవరైన ఒకరూ తప్పకుండా కడెం వచ్చి బోటింగ్ చేయడం గమనార్హం. పరిమితికి మించి పర్యాటకులను బోట్‌లో విహరించే సమయంలో దురదుృష్టవశాత్తు ఏమైన ప్రమాదం జరిగితే రక్షించే నాథుడే లేడు. బోటింగ్ సమయంలో పర్యాటకులకు ఎమైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ గజ ఈతగాల్లను పర్యాటక శాఖ వారు అందుబాటులో ఉంచాలి.
ఇక్కడ మాత్రం గజ ఈతగాల్లు లేకపోవడం దురదుృష్టకరం. పైగా 9సం॥ క్రితం ఏర్పాటు చేసిన బోట్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. మరో పడవను పర్యాటకశాఖ వారు ఏర్పాటు చేయకపోతే ఇటీవలే విజయవాడలోని కృష్ణనది ఇబ్రహీం పట్నం మండలంలోని పెర్రి వద్ద జరిగిన పడవ ప్రమాదం లాంటి సంఘటన పునరావృతమైయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నయాని పలువురు భావిస్తున్నారు. బోటింగ్ చేయడానికి కడెం ప్రాజెక్టు వద్ద శాశ్వత ఫ్లాట్‌ఫాం(రేవు) ఏర్పాటు చేసి పర్యాటకుల రక్షణ కొరకు రక్షణ కల్పించి మరింత అభివృద్ధి చేస్తే కొండల మధ్య ప్రాజెక్టు నిర్మాణం, సహాద్రి పర్వతాలను ఆనుకొని ఉన్న జలాశయం, కడెం జలాశయం చుట్టూ పచ్చని అడవులుపై భాగంలో కవ్వాల అరణ్యం, జన్నారంలోని జింకల పార్కు సందర్శకుల కోసం కడెం ప్రాజెక్టుకు ఆనుకొని నిర్మాణమై హరితరికార్డు ఇలా ఎన్నో ఉన్నాయి కనువిందు దృశ్యాలను చూసే అవకాశం లభిస్తుంది.

Comments

comments