Home ఫీచర్స్ నొప్పిని తగ్గిస్తుంది…!

నొప్పిని తగ్గిస్తుంది…!

Caffeine

 

కాఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదయాన్నే గొంతులో కాఫీ పడందే ఏపనీ చేయనివారు చాలామంది ఉన్నారు. కాస్త తలనొప్పిగా ఉన్నా వెంటనే కాఫీ తాగేస్తాం. అలాంటి కాఫీతో మరిన్ని ఉపయోగాలున్నాయని చెబుతున్నారు అధ్యయనకారులు. కాఫీలో ఉండే కెఫిన్ కి నొప్పిని తగ్గించే శక్తి ఉందని అలబామా యూనివర్సిటీ అధ్యయనకారులు చెబుతున్నారు. కెఫిన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయం అధ్యయనంలో తేలింది. 19 నుంచి 77 ఏళ్ళ వయసుగల 62 మంది పైన కాఫీ, టీ సాదా చాక్లెట్ వంటి ఇతర వినియోగాలను కెఫిన్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి వెళ్ళిన వారిలో నొప్పిని భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు. వీరందరు సగటున రోజుకు రెండు కప్పుల కాఫీ తాగేవాళ్ళు. 170 మిల్లీ గ్రాముల కెఫిన్ వినియోగించుకునేవాళ్ళుగా ఈ సర్వేలో రికార్డైంది.

Caffeine in coffee reduces pain