Home కుమ్రం భీం ఆసిఫాబాద్ భీంప్రాజెక్టులో కేజ్ కల్చర్ల ఏర్పాటుకు ప్రణాళికలు

భీంప్రాజెక్టులో కేజ్ కల్చర్ల ఏర్పాటుకు ప్రణాళికలు

భీంప్రాజెక్టులో రెండు కేజ్ కల్చర్ల ఏర్పాటు

రూ. నాలుగు కోట్ల 69లక్షలతో ప్రతిపాదినలు

అభివృద్ధి కానున్న మత్సకారులు

Cage-Culture

ఆసిఫాబాద్‌టౌన్: జిల్లాలోని కోమురంభీం భారీ ప్రాజెక్టులో రెండు కేజ్ కల్చర్లను ఏర్పాటు చేసి మత్సపరిశ్రమను అన్ని విధాలుగా అభివృద్ది పరిచేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మత్సపరిశ్రమాను అభివృద్ది పరిచేందుకు తెలంగాణ రాష్ట్రసర్కార్ అడుగులు వేస్తుంది.ఇందుకోసం కోమురంభీంప్రాజెక్టు రూపాయలు 50 లక్షలతో రెండు కేజ్ కల్చర్లను ఏర్పాటు చేసేందుకు అదిశగా చర్యలు తీసుకుంటున్నారు. కేజ్ కల్చర్ల ఏర్పాటుకు రూపాయలు 4 కోట్ల 69 లక్షల వరకు నిధులు అవసరం ఉన్నట్లు ప్రాతిపదినలు సైతం ప్రభుత్వానికి పంపించారు. అయితే కేజ్ కల్చర్ల ఏర్పాటుకు 1152 క్యూబిక్ మీటర్ల నీరు అవసరం ఉండగా ప్రాజెక్టులో పది టియంసిల నీటి సామర్దం ఉంది.

ఒక్కొ కేజ్ కల్చర్లకు రూపాయలు 25 లక్షల చొప్పున రెండు కేజ్ కల్చర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొ కేజ్ కల్చర్లలో సుమారు 25 టన్నుల వరకు చేపలు పెంచే అవకాశాలు ఉండగా ఇది కార్యరూపం దాల్చితే సుమారు 400 కుటుంబాలు పర్మినెంట్‌గా ఉపాధి పొందే అవకాశం సైతం కనిపిస్తున్నాయి. ఇతర జిల్లాలోని కొన్ని ప్రాజెక్టులలో కేజ్ కల్చర్ల ద్వారా మంచిఫలితాలు వస్తున్న క్రమంలో ఇది అంతట విస్తరించేందుకు అనువుగా ఉన్న పెద్ద ప్రాజెక్టులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ మండలాలో 7 ఫిష్‌మార్కెట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనుండడంతో పాటు మత్సకారులకు కుల సంఘభవనాలతో పాటు చేపలు అమ్ముకునేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సైతం తయారు చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటికే 13 మత్ససహకార సంఘాలు ఉండగా ఇందులో 830 వరకుసభ్యులు ఉన్నారు. జిల్లాలోని కోమురంభీం ప్రాజెక్టు పాల్వాయి పురుషోత్తంరావుప్రాజెక్టు,ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు,మట్టివాగు ప్రాజెక్టులతో పాటు ఇతర 33 నీటి వనరులలో సుమారు 35 లక్షల వరకు చేప పిల్లలను సైతం అధికారులు వదిలారు. జిల్లావ్యాప్తంగా మత్యపరిశ్రమను అభివృద్ది చేసేందుకు 4 కోట్ల 69 లక్షల నివేదికలను ప్రభుత్వానికి పంపగా 6 సంఘ భవనాల కోసం సుమారు 50 లక్షల వరకు వెచ్చించి ఆయా ప్రాజెక్టుల వద్ద ల్యాడింగ్ సెంటర్‌ల కోసం రూపాయలు 5 లక్షలు,చేపపిల్లల కోసం రూపాయలు కోటివరకు ప్రణాళికలుపంపించినట్లు సంబంధించిన అధికారులు పేర్కోంటున్నారు. ఎస్సీ,ఎస్టీలలోని మత్సకారులకు చేపలు పట్టడం,పెంచడంలో కూడ శిక్షణఇవ్వనున్నారని మొత్తానికి మత్సపరిశ్రమను విస్తరించి అన్ని విధాలుగా వారిని అభివృద్ది పరిచేందుకు చర్యలు తీసుకోనున్నారు.కేజ్ కల్చర్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలువగా మత్సకారులలో హర్షం వ్యక్తం చేశారు.