Home నాగర్ కర్నూల్ లెక్కలు పక్కాగా ఉండాలి

లెక్కలు పక్కాగా ఉండాలి

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ 

Collector-Sridhar

నాగర్‌కర్నూల్ ప్రతినిధి :రబీలో ఏ ఆదారం క్రింద ఎంత పంట సాగు చేస్తున్నారో పక్కాగాలెక్కలు తీసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీధర్ జాయింట్ అజమాయిషి అధికారులను ఆదేశించారు. శని వారం ఎస్‌జెఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏఆర్పటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రబీ సాగుకు సంబందిచి వ్యవసాయ ,నీటిపారుదల ,రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో సరైన నివేదికలు ఇవ్వాల్సి ఉండగా ఆయా శాఖలు అందింని సంఖ్యల మధ్య పొంతన ఉండటంలేదని మూడు శాఖల గణాంకాలు ఒకే తీరుగా ఉంటేనే జాయింట్ అజమాయిషి నిర్వహించినట్లు అని కలెక్టర్ అన్నారు.

మీరు అందించిన నివేదిక కేవలం 5,600ఎకరాలు మాత్రమే ఉందని ఇది ఎంతమాత్ర సమంజసంగాలేదన్నారు. శుక్రవారం వ్యవసాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సత్వర, సరైన నివేదికలు కోరారని 15రోజుల గడువు కోరినందున వెంటనే సంయుక్త అజమాయిషి విచారణ జరిపి సరైన నివేదికలు అందించాలన్నారు. ఈ ఏడాది చాలా చెర్వుల కింద పంటలు సాగుచేస్తున్నారని గత రెండు విడతల్లో సుమారు వెయ్యి చెర్వులు మరమ్మత్తులు రూ.250కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంత ఖర్చు చేసి అంత తక్కువ ఆయకట్టు సాగవుతుందంటే నమ్మబుద్ది కావడంలేదని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ ,నీటిపారుదల అధికారులు సింగారెడ్డి ,గోవిందు, ఆర్డీఓ రాజేందర్ కుమార్,శ్రీనివాసులు ఇతర ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.