Search
Sunday 18 November 2018
  • :
  • :

కాల్‌డ్రాప్‌పై ట్రాయ్ మరో లేఖ

TRAIన్యూ ఢిల్లీ: నెట్‌వర్క్ సమస్యతో ఫోన్ కాల్ మధ్యలో కట్ అయిపోవడమే కాల్‌డ్రాప్ సమస్య. దీనిపై ఇంతకు ముందు ట్రాయ్ జనవరి 1 నుంచి ప్రతికాల్ డ్రాప్‌పై వినియోగదారునికి ఒక రూపాయి చెల్లిచాల్సిందిగా టెలికాం ఆపరేటర్లకు కొరుతూ లేఖ రాసింది. అయితే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందిగా టెలికాం ఆపరేటర్లు స్పష్టం చేశాయి. ఈ సమస్యపై ట్రాయ్ సంస్థకి, టెలికాం ఆపరేటర్లకు మాటాల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 6కి వాయిదా వేసింది. టెలికాం ఆపరేటర్లు, వినియోగదారులకు ప్రతి కాల్‌డ్రాప్‌పై రూపాయి చెల్లించడం వల్ల కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తుందని వాదిస్తుండటం గమనార్హం. ఈ మేరకు టెలికాం సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తాము పరిహారం ఇవ్వలేమని చెప్పాయి. అయితే ట్రాయ్ ఆదేశాలపై కోర్టు ఎలాంటి స్టే విధించనప్పటికి విచారణను మాత్రం జనవరి 6కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలకు ట్రాయ్ మరోసారి లేఖ రాసింది.

Comments

comments