Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కాల్‌డ్రాప్‌లు తగ్గడం లేదు: ట్రాయ్

Call-dropsముంబయి: కాల్‌డ్రాప్‌లను నివారించడంలో టెలికం సంస్థలు విఫలమవుతూనే ఉన్నాయని, వీటిని ఇంకా పరిష్కరించడం లేదని ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ఆరోపించింది.  ఎయిర్ సెల్, వోడాఫోన్, ఐడియాలు కాల్ డ్రాప్ లను నివారించలేకపోతున్నాయని, వినియోగదారులపై భారం మోపుతున్నా యని టెలికం సంస్థ పేర్కొంది. ముంబై సర్కిల్‌లో ఈ సమస్య అధికంగా ఉందని ఈ సర్కిల్‌లో డ్రైవ్ టెస్ట్ జరిపి ట్రాయ్ నివేదిక ఇచ్చింది. నెట్‌వర్క్‌ను పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టి, మాస్కింగ్ టెక్నాలజీని వినియో గించుకోవడంలో తప్పు చేస్తున్నాయని ట్రాయ్ సూచించింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని, కాల్ డ్రాప్స్‌ను అరికట్టేందుకు ఆర్‌టిఎల్‌ను సమర్థవంతంగా వాడుకోవాలని పేర్కొంది. తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతా నికి వెళ్లి కాల్ కట్ చేసినప్పటికీ, అది ఇంకా కనెక్టయి ఉండడం వంటి సమస్యలు ఉన్నాయని ట్రాయ్ తెలిపింది. అయితే ఈ ఆరోపణలను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొట్టి పారేసింది. గతంలోనూ టెలికాం సంస్థలపై ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుల సమస్యలు పట్టించుకోకుండా కస్టమర్లను పెంచుకోవడంపైనే టెలికం సంస్థలు దృష్టిపెట్టాయని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.

Comments

comments