Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సాందీపనిలో ఇంటర్వూలు

భారీగా తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు

College1

కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో శనివారం బహుళజాతి కంపెనీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం ఇంటర్వూలు నిర్వహించారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ అయిన జెన్‌ప్యాక్ట్ ప్రతినిధులతో పాటు కళాశాల సిఇఓ హరిస్మర ణ్‌రెడ్డి, డైరెక్టర్ బాలాజీరావు, ప్రిన్సిపల్ సాయిబాబా, ప్రవీన్‌కుమా ర్‌లు ఇంటర్వూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి 600 మంది విద్యార్థిని విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ప్లేస్‌మెంట్స్ కోసం తరలివచ్చారు.

దీంతో సాందీపని కళాశాలలో విద్యార్థులతో సందడిగా మారింది. మూడు విభాగాల్లో నియామక ప్ర క్రియలను చేపట్టగా సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వూలు కొ నసాగాయి. ఇందులో అత్యంత ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి మరుసటి రోజు కంపెనీ ప్రతినిధులతో నియామక పత్రాలు అందజే యనున్నట్లు వారు తెలిపారు. అధ్యాపకులు మనోజ్‌కుమార్, రాజు, శ్యాం, సంధ్య, రాజేందర్, సవిత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments