Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు చేసే ఖర్చులు ఇలా తగ్గించుకోవచ్చు?

Parliament

ప్రజాప్రతినిధులు అంటే ప్రజలచేత ఎన్నుకోబడి ప్రజలచేత పోషించబడే వారు. ప్రజాప్రతినిధులు ప్రజా సేవలో ఉండాల్సిన అవసరాన్ని బట్టి ప్రభుత్వం వారికి సర్వ సౌకర్యాలను కల్పిస్తోంది. బస్సుల్లోకెళితే ఎంఎల్ఎ, ఎంపిలకు ప్రత్యేక సీట్లు కేటాయించి ఉంటాయి. కానీ కనీసం ఐదేళ్లల్లో ఒక్కసారైనా ప్రయాణించరు.. ఎసి కార్లల్లో తప్పక ప్రయాణించాల్సిందే.

 ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. నెటిజన్లు వారి స్పందనను పలు విధాలుగా కామెంట్ల రూపంలో ఇస్తున్నారు.
ప్రతినిధిగా ఎన్నికైనా నాటినుండి ప్రభుత్వం అన్ని విషయాల్లో వారికి ఎక్కడా ఇబ్బందికలగకుండా అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే కాలానుగుణంగా ప్రభుత్వం వారికి కల్పిస్తున్న కొన్ని సౌకర్యాలను తగ్గించుకోవాలసివుంది. ఉదాహారణకు దశాబ్దం క్రితం ఫోన్ సౌకర్యాలు ఎంతో ఖరీదైనవి. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం కల్పించే ఫోన్ బిల్లు అపరిమితంగా వుండేవి. ఆ రోజుల్లో కనీసం రూ.10 నుండి రూ.15వేలైనా వుండేవి. కట్ చేస్తే.. ఇప్పుడు కాలం మారిపోయింది… ఎన్నో నెట్వర్క్ కమ్యూనికేషన్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. పోటీపోటీగా ఆఫర్లను ఇస్తున్నాయి. నెలకు అతితక్కువ బిల్లుతో మోబైల్ ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఉదాహరణకు ఓ ప్రైవేట్ టెలికం సంస్థ నెలకు రూ.350లు బిల్లు చెల్లిస్తే లోకల్, ఎస్ టిడి సహా అపరిమిత టాక్ టైం ఇస్తోంది. దీనితోపాటు ఉచిత ఇంటర్నెట్ డేటాను కల్పిస్తోంది.

కేవలం రూ.350లకే అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ టెలిఫోన్ బిల్లుల పేరిటి ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఎందుకు చెల్లిస్తోంది అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీటిపై ప్రభుత్వ అధికారులు, గవర్నర్ స్థాయి వ్యక్తులు స్పందించి ప్రజాప్రతిధులకు అనవసరంగా కేటాయిస్తున్న బడ్జెట్ ను కోతపెట్టాలని వివిధ అంశాలపై సోషల్ మీడియా యూజర్లు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

* అలాగే బస్సుల్లో ప్రయాణించని ఎంఎల్ఎ, ఎంపిలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులకు కల్పించే ప్రయాణ ఖర్చుల్లో కూడా ప్రభుత్వం కోత విధించాలని కోరుతున్నారు.

* మార్కెట్ లో వివిధ టెలికం సర్వీసుల ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులకు ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ సర్వీసులకు అయ్యే ఖర్చుల్లో ఎప్పటికప్పుడు మార్చుపులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వాతు చర్యలు తీసుకోవాలి.

* ప్రజా ప్రతినిధిగా ఉన్నంతకాలం ప్రభుత్వం కల్పించే బంగ్లాల్లోనే వుండాలి. అలా కాని పక్షంలో అద్దెకు ఉంటూ ప్రభుత్వం వారికిచ్చే గృహనిర్వహణ ఖర్చును నేరుగా వారి జేబుల్లోకి వెళ్లకుండా నియంత్రించాలి. అద్దె భవనాల్లో ఉండి ప్రభుత్వం నుండి అద్దె మొత్తాన్ని తీసుకునే పద్ధతిని తీసివేయాలి.

Can the government reduce the cost of public Representatives ?

Comments

comments