Home అంతర్జాతీయ వార్తలు పసికందును చంపారు.. భార్యను చెరిచారు

పసికందును చంపారు.. భార్యను చెరిచారు

Joshua-Boyle

గోడు వెల్లబోసుకున్న హఖ్ఖానీ నెట్‌వర్క్ బాధితుడు

టొరంటో: తాలిబన్ల చేతిలో ఐదేళ్ల చెర నుంచి విముక్తి పొందిన కెనడా జాతీయుడు జొషూవా బాయ్లే స్వదేశం చేరుకున్నారు. తాలిబన్ల అనుబంధమైన ఉగ్రవాద హఖ్ఖానీ నెట్‌వర్క్ వారి పరమ కిరాతక చర్యలను, తమ కుటుంబం అనుభవించిన బాధలను శనివారం వెల్లడించారు. తన కళ్లముందటే తాలిబన్ నెట్‌వర్క్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్‌లో తన నెలలప్రాయపు ఆడశిశువును చంపివేశారని, భార్యపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఐదేళ్ల కిత్రం బాయ్లే దంపతులను హఖ్ఖా నీ నెట్‌వర్క్ వారు అపహరించుకువెళ్లారు. తమ బందీలుగా మల్చుకుని చిత్రహింసలకు గురిచేశారని వెల్లడైంది. బుధవారం వారి బారి నుంచిభద్రతా దళాలు రక్షించి బయటకు తీసుకువచ్చాయి. శనివారం కెనడా చేరిన తరువాత ఈ బాధితుడు వార్తా సంస్థలకు తమ చేదు అనుభవాలతో ఓ వివరణాత్మక ప్రకటనను పంపించారు.

అమెరికన్ భార్య కైట్లాన్ కొలెమన్, ముగ్గురు పిల్లలతో కలిసి బా య్లే స్వదేశం చేరారు. తాలిబన్ల చెరలో తాము అ నేక కష్టాలను ఎదుర్కోవల్సి వచ్చిందని , హఖ్ఖానీ గార్డు ఒకడు తన భార్యను రేప్ చేశారని, ఈ క్ర మంలో దళనేతలు కూడా దారుణరీతిలో తన భా ర్యపై లైంగిక చర్యకు పాల్పడ్డారని , ఇప్పటికైనా ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తనకు న్యాయం చేయాల్సి ఉందని, నిండు గర్భిణీని, దేశ సందర్శనకు వచ్చిన వారిని అపహరించుకుని వెళ్లి దారుణానికి పాల్పడటం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న ఆఫ్ఘన్‌లోని గ్రామస్తులకు సాయం చేసేందుకు తాను తాలిబన్ల ఆధిపత్యపు మారుమూల ప్రాంతాలకు వెళ్లానని , స్వ చ్ఛంద సేవా సంస్థలు, సహాయక కార్యకర్తలు , ప్ర భుత్వ సాయం ఏదీ లేని ప్రాంతానికి వెళ్లిన తనను బందీగా చేసి చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాతుకునిపోయి, వేళ్లూనుకుని ఉన్న అన్యాయం , అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే కృతనిశ్చయాన్ని , అనితర దక్షతను తనకు, తన కుటుంబానికి ఆ దేవుడు కల్పించారని తమ ప్రకటనలో వెల్లడించారు.

Canadian says child killed, wife raped in Afghanistan.