Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సిగరెట్ తాగితే క్యాన్సర్ వెంటే

 Cancer Coming with Cigarette drinks

మన తెలంగాణ/ఆర్మూర్: రెండు వేళ్ల్ల నడుమా సిగరెట్ పట్టుకుని పొగ పీల్చి వదిలితే మొదట్లో సరదాగా అనిపిస్తుంది. స్టైల్ కోసమో, ఫ్రెండ్స్ బలవంతం మీదో ధూమపానం ప్రారంభిస్తే అది కాస్త వెసనం లాగా మారుతుంది. తద్వారా ఎప్పటికప్పుడు జబ్బులు కాలికావడంతో పాటు రకరకాల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. కొత్తవారు సిగరెట్‌ను ముట్టుకోకపోవడం ఎంత మంచిదో, అలవాటు ఉన్నవారు ఉన్న ఫలంగా వదిలేయడం అంత ఉత్తమం. సిగరెట్, బీడీ తాగడం పొగాకు ఉత్పత్తుల నమలడం వల్ల వచ్చే కాన్సర్ వ్యాధులు ఏంటో ఒక్కసారి గమనిద్దాం…
తీవ్ర వ్యాధులు
1. బ్రెయిన్ స్టోక్ రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం ద్వారా మెదడులో రక్త ప్రసరణకు ఆంటకం ఏర్పడి బ్రెయిన్ స్టోక్ రావచ్చు.
2. అంధత్వం కళ్లకు రక్తాన్ని చేరవేసే నాళాలు నాడులు పాడై అంధత్వం రావచ్చు.
3.చిగుర్ల ఇన్‌ఫెక్షన్ సిగరెట్ పొగలో ఉండే టాక్సిస్త కారణంగా చిగుర్లు ఇన్‌ఫెక్షన్‌కు గురవ్వచ్చు.
4.ఆయోర్టిక్ రప్సర్ ఊపరితిత్తులో ఉండే రక్తనాళం ఉన్నట్టుండి పగిలిపోవచ్చు.
5.గుండె జబ్బులు గుండెతో సంబంధం ఉన్న రక్తనాళాలు సన్నబడి గుండె జబ్బుకు దారి తీయవచ్చు
6.న్యూమోనియా ఊపిరితిత్తులు బలహీనపడి న్యూమోరియా బారిన పడవచ్చు
7.హార్డెనింగ్ ఆఫ్ అర్జరీస్ ధమనులు గట్టిగా తయారవోచ్చు
8.ఊరిపితిత్తుల వ్యాధులు, ఉబ్బసం ఎడతెగని టాక్సీన్లతో కూడిన పొగ వల్ల ఊపిరితిత్తులు పలు వ్యాధులకు, ఉబ్బసానికి గురికావచ్చు
9.పెన్జిలిటీ సమన్యలు వీర్య కణాలు, అండోల నాణ్యత, ఆకారంలో మార్పులు జరిగి పిల్లలు కలుగకపొవచ్చు
10.తుంటి ఎముకలు విరగటం ఎముకలు బోలుగా తయారవటం వల్ల వల్ల తుంటి ఎముకలు తెలికగా విరిగే అవకాశాలు పెరుగుతాయి.
లెక్కలేనన్ని క్యాన్సర్లు
ధూమపానంతో ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సరే కాకుండా మరెన్నో క్యాన్సర్లు దాడి చేస్తాయి.
అదేంటంటే… తల, మెడ, సంబంధ క్యాన్సర్లు, రక్త క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, మూత్రపిండల క్యాన్సర్, పిత్తాశయ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, మూత్రా శయ క్యాన్సర్ మొదలుగునవి కలుగుతాయని యువత మేలుకోని ధూమపానంకు దూరం ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Comments

comments