Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అవగాహనతో కేన్సర్ నిర్మూలన : కెటిఆర్

Cancer Elimination with Awareness : KTR

హైదరాబాద్ : అవగాహనతోనే కేన్సర్‌ను నిర్మూలించవచ్చని తెలంగాణ మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఆయన బసవతారకం కేన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో అడ్వాన్స్‌డ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెలబ్రిటీలు ముందుకొచ్చి కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికి కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఈ ఆస్పత్రి పన్ను రద్దు చేసిన ఘనత కెసిఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. బసవతారకం ఆస్పత్రి బయట షెల్టర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే మరిన్ని షెల్టర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆస్పత్రి చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ … ఆస్పత్రి పన్ను రద్దు చేసిన కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. నలబై బెడ్లతో ప్రారంభమైన ఆస్పత్రి ప్రపంచ స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. బిఎంటి యూనిట్‌ను కెటిఆర్ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు.

Cancer Elimination with Awareness : KTR

Comments

comments