Home జాతీయ వార్తలు నోయిడాలో దారుణం..!

నోయిడాలో దారుణం..!

Husband Murdered his Wife at Gutti

నోయిడా: యుపిలోని నోయిడాలో దారుణం జరిగింది. భర్తకు నోటీ కేన్సర్ ఉండటంతో అతడి ఆరోగ్యం దృష్ట్యా భార్య శృంగారానికి ఒప్పుకోలేదు. దాంతో కోపోద్రిక్తుడైన భర్త కత్తితో భార్య గొంతుకోసి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…  బార్బర్ పని చేసే అజయ్‌(40)కు మమత దేవి(36)తో 17 సంవత్సరాల కింద వివాహమైంది. ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఏడాది క్రితం అజయ్‌కు నోటి కేన్సర్‌ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అప్పట్నుంచి అజయ్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ఆయన భార్య మమత కుటుంబ పోషణ కోసం ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకుని నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో 20 రోజుల తర్వాత ఈ నెల 11న భార్య వద్దకు వెళ్లిన అజయ్‌ తనతో శృంగారంలో పాల్గొనాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి ఆమె నీకు  ఆరోగ్యం బాగాలేదని వారించేందుకు యత్నించడంతో  కోపోద్రిక్తుడైన అజయ్ కత్తితో గొంతు కోసి చంపేశాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.