Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

క్యాన్సర్‌ను నిరోధించే పుష్పాలు

HOPEవాషింగ్టన్ : బీర్ తయారీలో ఉపయోగించే హోప్ పుష్కాలకు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో నిర్ధారణ అయింది. బీర్‌లో చేదుకు కారణమయ్యే ఈ పుష్పాల్లో హ్యుమ్యులోన్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనంలో పాల్గొన్న ఇదాహో వర్సిటీ పరిశోధకులు క్రిస్టోఫెర్ వైనంత్ తెలిపారు. హ్యుమ్యులోన్స్ అల్ఫా ఆమ్లాలకు వాపు, క్యాన్సర్‌పై పోరాడే గుణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇక లుప్యులోన్స్, బీటా ఆమ్లాలు మానవ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంలో కీలక పాత్ర పోషియాని పేర్కొన్నారు. ఈ రెండు ఆమ్లాలకూ క్యాన్సర్ కణాలను హతమార్చే సామర్థం ఉందని చెప్పారు. రక్త క్యాన్సర్ కణాలు ఎముకలకు అంటిపెట్టుకుపోకుండా అడ్డుకోవడంలో సైతం ఇవి సహకరిస్తాయని టెక్‌టైమ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమ్మేళనాల గుణాలను ప్రేరేపించేందుకు సైంటిస్టులు కృషి చేస్తున్నారు. వీటిని త్వరలోనే కృత్రిమంగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

comments