Home తాజా వార్తలు కూకట్ పల్లిలో గంజాయి పట్టివేత

కూకట్ పల్లిలో గంజాయి పట్టివేత

 

Cannabis

 

మేడ్చల్: కూకట్ పల్లి మెట్రో సమీపంలో గురువారం మధ్యాహ్నం భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగరం నడిబొడ్డున భారీ మొత్తంలో గంజాయి పట్టుబడడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రెల్లి రాజు అనే వ్యక్తి గంజాయిని తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద పదమూడు కిలోల గంజాయి ఉందని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదంమోపుతున్న విషయం తెలిసిందే.

 

Cannabis Captured in Kukatpally in Medchal