Search
Saturday 22 September 2018
  • :
  • :

ఇల్లే గంజాయి వనం

ఇంట్లోనే గంజాయి సాగు
40 పూల కుండీల్లో
మొక్కల పెంపకం
ఎసిలు, హీటర్లతో జాగ్రత్తలు
టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
8.6 కిలోల గంజాయి స్వాధీనం

GANJAYI

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఎక్కడో అడవుల్లో రహస్యంగా జరిగే గంజాయి సాగు హైదరాబాద్ నడిబొడ్డున ఓ వ్యక్తి ఇంట్లో చోటుచేసుకోవడం కలకలం రేపింది. అదికూడా హైటెక అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న గంజాయి సాగు అధికారులను ఆశ్చర్యానికి లోనుచేసింది. ప్రతికూల వాతావరణంలో గంజాయి మొక్క లు పెరగవని భావించిన సదరు వ్యక్తి వాటిని పెంచేందుకు తన ఇంట్లో ఎసి, హీటర్లు పెట్టి వాతావరణ మార్పులు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నాడు. అంతేకాదు, పక్వానికి వచ్చే గంజాయి మొక్కల నుంచి వాసన బయ టకు రాకుండా ఉండేందుకు కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నాడు.

ఈ విషయాన్ని పసిగట్టిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా 40 పూల కుండీల్లో గంజాయి మొక్కలతో పాటు 8.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి యన్.కోటిరెడ్డి అదనపు డిసిపి కథనం మేరకు వివరా లు ఇలా ఉన్నాయి. గోల్కొండలోని వైకే రెసిడెన్సీలో సయ్యద్ షాహద్ హుస్సేన్ (33) నివాసముంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఇతగాడు ఐదేళ్ల నుంచి గంజా యికి బానిసయ్యాడు. గంజాయి ఖరీదు చేసేందుకు డబ్బులు సరిపోకపోవడంతో తక్కువ రేటుకు ఎక్కువ గంజాయి తీసుకువచ్చి ఇతరులకు విక్రయించి తన ఖర్చులను వెల్లదీసుకునేవాడు.

ఈ వ్యాపారంలో డబ్బులు బాగా వస్తుండడంతో తన ఇంట్లోనే గంజాయి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడా ది కాలం నుంచి తన ఇంట్లోని గదిలో 40 పూల కుండీలలో గంజాయి మొక్క లను పెంచడం ప్రారంభించాడు. ప్రతికూ ల వాతావరణంలో గంజాయి మొక్కలు పెరగవని భావించిన సయ్యద్ వాటికి కావాల్సిన ఎసిలు, హీటర్లు అన్ని సమకూర్చాడు. గంజాయి మొక్కలకు పూలు పూసిన సమయంలో వాసన వస్తుంది. దీన్ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు సైతం తీసుకున్నాడు. ఇలా పెంచిన మొక్కల నుంచి వచ్చిన గంజాయిని ఇంట్లోనే కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి గుట్టుచప్పు డుకాకుండా ఇతరులకు విక్రయించేవాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందు కున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి, గోల్కొండ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్, ఎస్‌ఐలు జి.మల్లేష్, ఎస్‌కె జకీర్ హుస్సేన్, యన్.శ్రీశైలంలు సోమవారం మధ్యాహ్నం సయ్యద్ ఇంటిపై దాడి చేశారు. అతని అదుపులోకి తీసుకున్న పోలీసులు 8.6కిలోల గంజాయి, 40 పూల కుండీలలో ఉన్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. తదు పరి విచారణ నిమిత్తం నిందితుడ్ని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

Comments

comments