Home తాజా వార్తలు రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగులు

రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగులు

CANNABIS

అమరావతి: విజయవాడలో మంగళవారం ఉదయం గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి అక్రమ దందా నడుస్తోంది. 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు గంజాయిని అమ్మడానికి ఉపయోగించుకుంటున్నారు. అక్రమార్కులు స్టూడెంట్స్ నుంచి వస్తువులు లాక్కుంటున్నారు. విద్యార్థులపై బ్లేడ్స్, కత్తులతో దాడులు చేస్తున్నారు. మాచవరం పోలీస్ స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయాలు గుట్టుగా జరుగుతున్నాయి. విజయవాడ సిసి గౌతమ్ సవాంగ్‌కు ఓ ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని సదరు ఎన్ఆర్ఐ ఆరోపణలు చేశారు.