Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

గంజాయి రవాణా చేసినా, అమ్మినా జైలుకే

గంజాయి రవాణా చేసినా, అమ్మినా చర్యలు తప్పవు
ఇక పిడి యాక్టు నమోదు
దృష్టి సారించిన ఎక్సైజ్ శాఖ

JAIL-

మనతెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబా ద్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండ కొనసాగుతున్న గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. గంజా యిని రవాణా చేసిన, అమ్మిన వారిపై ఎక్సైజ్ శాఖ పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైలుకు పంపిస్తోంది. గుడుంబా తయారీ కేంద్రంగా పేరుగాంచిన ధూల్‌పేట పరిసరా ల్లో ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ విస్తృతదాడులు నిర్వహించి గుడుంబా అమ్మకాలను పూర్తిస్ధాయిలో ఆరికట్టింది. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 26 మంది గుడుంబా డాన్‌లపై ఎక్సైజ్‌శాఖ పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించింది. జిల్లాలో గుడుంబా అమ్మకాలు పూర్తిగా ఆరికట్టడంతో కొంతమంది గుడుంబా వ్యాపారులు గంజాయి అమ్మకాలపై దృష్టి సారించారు.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్,నిజమాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యపేట, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తదితర ప్రాంతాలను వ్యాపారులు బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాల్లో గంజాయిని రహస్యంగా నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో గంజాయి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీనిపై దృష్టి సారించిన జిల్లా ఎక్సైజ్‌శాఖ గంజాయి రవాణా, అమ్మకాలను ఆరికట్టేదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ధూల్‌పేట పరిసరాల్లో ప్రత్యేక దృష్టి సారించిన ఎక్సైజ్ అధికారులు పలువురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసి వారి నుంచి పెద్ద ఎత్తున గంజా యిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

గంజాయి కేసులో పట్టుబడిన జైలు కెళ్ళిన కొంతమంది బయటకు వచ్చిన తరువాత తమ ప్రవృత్తిని మార్చు కోవడంలేదు. జైలు నుంచి వచ్చిన సదరు వ్యక్తులు తిరిగి గంజాయి రవాణా చేయడం, విక్రయాలు జరు పడం చేస్తున్నారు. దీనిని జిల్లా ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికా రులు సీరియస్‌గా తీసుకుని గంజాయి విక్రయాలు, కొనుగోళ్లను పూర్తిగా నివారించేందుకు నిందితులపై పీడీ యాక్ట్‌ను విధిస్తున్నారు. ఇటీవల ధూల్‌పేటలో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు, అరెస్టులతో గంజాయి విక్రేతను కట్టడి చేశారు. ఈ సందర్భంగా అధికారులు 25 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేసి 115 కిలోల గంజాయి స్వాధీనం చేసుకు న్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశానుసారం ఎక్సైజ్ అధికారులు గంజాయి రవాణా చేసేవారిపై, విక్రయాలు జరిపే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు పంపిస్తున్నారు.

ఇదేవిధంగా ధూల్‌పేటకు చెందిన శంకర్‌సింగ్ (25), సురేందర్‌సింగ్ (34)లు గంజాయి విక్రయాలు జరుపుతూ నగర పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి 2015లో వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. జూన్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన వీరిద్దరు తిరిగి గంజాయి అమ్మకాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. కొద్దికాలం క్రితం గంజాయి అమ్ముతున్న శంకర్‌సింగ్, సురేందర్ సింగ్‌లను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశాల మేరకు శాంతిభద్రతల సమస్యతో పాటు ప్రజారోగ్యానికి భంగకరంగా మారిన శంకర్‌సింగ్, సురేందర్‌సింగ్‌లపై ఎక్సైజ్ అధికారులు రెండవసారి పీడీ యాక్ట్ నమోదు చేశారు.

Comments

comments