Home తాజా వార్తలు గోల్డెన్ గౌన్ డ్రెస్సులో మెరిసిన ఐష్‌…

గోల్డెన్ గౌన్ డ్రెస్సులో మెరిసిన ఐష్‌…

 

పారిస్‌: 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బాలీవుడ్ అందాల భామ ఐశ్వ‌ర్య‌రాయ్ సందడి చేశారు. రెడ్‌కార్పెట్‌పై గోల్డెన్ గౌన్ డ్రెస్సులో ఐష్‌ సాగరకన్యలా మెరిసిపోయారు. కూతురు ఆరాధ్య‌తో స‌హ ఐశ్వ‌ర్య ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు హాజ‌రైంది. లెబ‌నీస్ డిజైన‌ర్ జీన్ లూయిస్ సబాజీ, ఐశ్వ‌ర్య గౌన్‌ను త‌యారు చేశాడు.

 

ఈ సందర్భంగా ఐష్ త‌న ఫోటోలు, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో కంగనా రనౌత్‌, డయానా పెంటీ, ప్రియాంక చోప్రా, హీనా ఖాన్‌, దీపికా పదుకొణె, హుమా ఖురేషీ తదితరులు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేసిన వియషం తెలిసిందే.

 

 Cannes 2019: Aishwarya rai in gold gown dress