Home తాజా వార్తలు పంజాగుట్టలో కారు ప్రమాదం

పంజాగుట్టలో కారు ప్రమాదం

Nagarjuna-circle

హైదరాబాద్: పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ వద్ద సోమవారం ఉదయం కారు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కారులో ఉన్న నలుగురు యువకులు పారిపోయారు. కారు మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.