Search
Thursday 15 November 2018
  • :
  • :

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

Car-Accident

రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండలం రావిరాల ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఓ కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిసిఎస్ కంపెనీ ఉద్యోగి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అంబర్‌పేట నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఓ స్విఫ్ట్‌ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి చందానగర్ కు చెందిన శివరామకృష్ణగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments