Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కారు బీభత్సం

Car collision of another parking car
బోధన్: పట్టణంలోని గోశాల రోడ్డులో మాతృశ్రీ విద్యాసంస్థ కరస్పాండెంట్ కారు  అర్ధరాత్రి వేళ విధ్వంసం సృష్టించింది. ఇటీవల టిఎస్16ఈజి0666 నంబరు గల కారులో ఒక యువకుడు అతివేగంతో వచ్చి పార్కింగ్ చేసి ఉన్న మరో కారును ఢీకొనడంతో పాటు గోడను సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. అర్దరాత్రి వేళలో ప్రమాదానికి కారణమైన కారు బోధన్ పట్టణంలోని మాతృశ్రీ విద్యాసంస్థ డైరెక్టర్ దిగంబర్‌కు చెందినదిగా బాధితుడు ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభాకర్‌కు చెందిన ఎపి15ఎపి7232 నంబరుగల స్విఫ్ట్ కారును వెనుక నుండి బలంగా ఢీ కొనడంతో పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసే సరికి తన కారును,కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టిన యువకుడు అక్కడి నుండి పారిపోయాడని బాధితుడు పేర్కొన్నారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం చేసి ఉండొచ్చని ప్రభాకర్ ఆరోపించాడు. విషయాన్ని పోలీసులకు సమాచారం అందించినప్పటికి నామ మాత్రపు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన కారును వెంటనే అక్కడి నుండి పంపించి వేశారని ఈ విషయంలో పోలీసుల తీరుపై తనకు అనుమానం ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదానికి కారణమైన యువకునికి బదులు మరో వ్యక్తి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారని ఆయన విమర్శించారు. విద్యాసంస్థ అధినేత డబ్బుకు దాసోహమై పోలీసులు కేసులను తారుమారు చేస్తున్నారని ఘాటుగా విమర్శించాడు. తనకు సరైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

comments