Home జోగులాంబ గద్వాల్ వంతెనపై దగ్ధమైన కారు

వంతెనపై దగ్ధమైన కారు

Car-Burn-Accident

ఇటిక్యాల: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని కృష్ణానది వంతెనపై కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇటిక్యాల ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ కథనం మేరకు కర్ణాటక రాష్ట్రం ధవనగిరి ప్రాంతానికి చెందిన శశిధర్ అనే వ్యక్తి శనివారం స్వగ్రామం నుండి హైదరాబాద్‌కు బయలుదేరగా కృష్ణానదిపై ముందుగా వెళుతున్న లారీని ఢీకొనడంతో కారు ఇంజన్‌లో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి, అతని భార్య అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. కారులో పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్గమైంది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వనపర్తి, గద్వాల్ ప్రాంతాలనుండి ఫైర్ ఇంజన్‌లు సంఘటన స్థాలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అధేవిధంగా జాతీయరహదారిపై గల డివైడర్ మీద ఉన్న గడ్డి, చెట్లకు మంటలు వ్యాపించడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఫైర్ ఇంజన్‌లు రావడంతో మంటలు అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇటిక్యాల ఎస్.ఐ.ప్రవిణ్ కుమార్ తెలిపారు.