Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

గోదావరి నదిలోకి దూసుకెళ్లిన కారు

ఐదుగురు దుర్మరణం
Carయానాం: కేంద్ర పాలితప్రాంతమైన యానాం నియోజకవర్గ పరిధిలోని దరి యాలతిప్ప వద్ద ఏటిగట్టుపై నుంచి కారు అదుపుతప్పి గోదావరినదిలోకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు దుర్మ రణం పాల య్యారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానికులు గోదావరిలో కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో నది లో నుంచి కారును వెలికితీశారు. కారులో ఇద్దరు చిన్నారులు సహా ఐదు మృత దేహాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన ఇండికా వి2 కారులో నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోరంగికి చెందిన కొప్పాడి సత్తి రాజు(65), ధనలక్ష్మి(60), కోడలు పార్వతి(30), మనవరాళ్లు రిషిత(7), అన్షిత(5) మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మొత్తం ఆరుగురు కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిం దని, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉందని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Comments

comments