Home తాజా వార్తలు మూడు బైకులను ఢీకొట్టిన కారు…

మూడు బైకులను ఢీకొట్టిన కారు…

NLG-Accidentసంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శనివారం కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మూడు బైకులను డీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చౌటుప్పల్ నుంచి గుడిమల్కాపురం వైపు వస్తున్న కారు పెట్రోలు బంకు మాలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మూడు బైకులను డీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకులపై వస్తున్న ముగ్గిరికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఏపూరి గ్రామానికి చెందిన ఎరసాని అనిల్(20) చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. చికిత్స పొదుతున్న మరో ఇద్దరిని సింగరాయచెర్వు గ్రామానికి చెందిన శ్రీకాంత్, అల్లందేవిచెర్వు గ్రామానికి చెందిన గుండు నరేష్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు బైకులు నుజ్జు, నుజ్జు కాగా, కారు ముందు బాగం డ్యామేజ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ పరారిలో ఉన్నన్నాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Car hits three bikes At yadagirigutta