Home తాజా వార్తలు ఫిల్మ్‌నగర్‌లో కారు బీభత్సం

ఫిల్మ్‌నగర్‌లో కారు బీభత్సం

ACCIDENTహైదరాబాద్ : నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ పక్కనే ఉన్న స్టాండ్‌లో ఆగిఉన్న ఆటోలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగు ఆటోలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.