Home తాజా వార్తలు అదుపుతప్పి గుంతలో పడిన కారు

అదుపుతప్పి గుంతలో పడిన కారు

 

కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడె మండలం మోతె సమీపంలో ఆదివారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మేడారం నుంచి పాల్వంచకు వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న గుంతలో పడింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును గుంతలో నుంచి బయటకు తీశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

 

Car Roll Over in Bhadradri Kothagudem