Home తాజా వార్తలు ఔటర్‌పై కారు బోల్తా: ఒకరి మృతి

ఔటర్‌పై కారు బోల్తా: ఒకరి మృతి

Car-Roll-Over-in-Outer-Ring

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ దగ్గర శనివారం ఉదయం ఔటర్‌ రింగు రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.