Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

విష రసాయనం

ఫెర్టిలైజర్ లో క్యాన్సర్ కారకాలు
18 రకాలను నిషేధించిన కేంద్రం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వ్యాపారుల్లో ఆందోళన
అంతర్మథనంలో అన్నదాత
నిషేధంపై సర్వత్రా హర్షం

Fertiliser1

ప్రాణకోటికి హానీ కలిగించే పురుగు మందులను ప్రభుత్వం నిషేధించింది. వాటితో పండించే పంటలన్నీ విషపూరితమేనని కేంద్రం నిర్ధారణకు వచ్చింది. అవితిన్న ప్రజలతోపాటు సమస్థ ప్రాణకోటి రోగాల భారిన పడడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కల్పోతున్నట్టు తేల్చింది. ఈక్రమంలో 18 రకాల ఫెర్టిలైజర్స్‌ను నిషేధించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇది క్షేత్రస్థాయిలో అమలవుతుందా.. లేదా అనేదే సందేహం.

దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని వేచి చూడాలి. పంట సాగు కోసం ఉపయోగించే పురుగు మందుల వల్ల ఎన్నో ప్రాణాంకమైన జబ్బులతోపాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం చోటు చేసుకుంటోంది. పంటలకు సోకే తెగుళ్ల నివారణ కోసం, అధిక దిగుబడుల కోసం పంటలు ఏపుగా పెరగడం కోసం వాడే రసాయనాల వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. వీటితో పాటు వాటి తో పండే పంటలను తిని పశు పక్షాదులతో పాటు మానవ జాతి తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో పాటు చిన్న పిల్లలో

Comments

comments