Home తాజా వార్తలు లెనిన్‌నగర్‌లో కార్డెన్‌సెర్చ్

లెనిన్‌నగర్‌లో కార్డెన్‌సెర్చ్

POLIC-CHECKSరంగారెడ్డి : సరూర్‌నగర్ మండలం మీర్‌పేటలోని లెనిన్ నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. రాచకొండ సంయుక్త సిపి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 180 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని తొమ్మిది ఆటోలు, 16 బైక్‌లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. 13 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు పాత నేరస్తులు ఉన్నట్లు అదనపు క్రైమ్ డిసిపి జానకి తెలిపారు.