Home ఎడిటోరియల్ హృద్రోగులకు ఊరట?

హృద్రోగులకు ఊరట?

 పరిమిత ధరల చట్రంలోకి స్టెంట్ !

STENT-1

బహుళాజాతి కంపెనీలు ఈ స్టెంట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో ఎబౌట్‌మెడ్‌ట్రానిక్స్, బోస్టన్ సైంటిఫిక్ కంపెనీలు రూడా ఉన్నాయి. వాటి ఉత్పత్తులన్నీ కలిపితే దేశంలోని మార్కెట్ వాటాలో 60శాతం దాకా ఉంటుంది. ఎబౌట్ స్టెంటు ధరలో వ్యత్యాసాలు ఉన్నాయి. గరిష్ఠ ధరకు , ల్యాండెడ్ ధరకు మధ్య 294 శాతం నుంచి 740 శాతం తేడాలు ఉంటాయి. మిగతా బ్రాండ్ల స్టెంట్ల ధరల్లో ఈ వ్యత్యాసం 464 శాతం నుంచి 1200శాతం దాకా ఉంటుందని ఎన్‌పిపిఎ తెలిపింది.

గుండె జబ్బులలో వాడే స్టెంట్లను ‘ ఔషధాల ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఓ) ’ జాబితాలోకి తెస్తూ గత వారం ఔషధాలు, ఔషధ పరికరాల శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ నోటీసు ఇవ్వడానికి ముందురోజు ఈ ప్రకటన విడుదలైంది. అందువలన ప్రాణ రక్షక పరికరాలైన వాటి ధరలను అందుబాటులోకి తేవడం సాధ్యంకానుంది. మందును గాని, ఔషధ పరికరాన్ని గాని డిపిసిఒ జాబితా క్రిందకు తేవడం జరగగానే జాతీయ ఔషధ ధరల అథారిటీ (ఎన్‌పిపిఎ)దాని ధరపై పరిమితిని విధిస్తుంది. అందువల్ల ధర బాగా తగ్గవచ్చు.
గత గురువారం ఉదయం ఢిల్లీ హైకోర్టు ఈ అంశంలో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఆ విచారణలో భాగంగానే కేంద్రానికి కోర్టు బెంచ్ నోటీసు జారీ చేసింది. స్టెంట్లు ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.25,000నుంచి రూ.2, 50, 000 దాకా ధర పలుకుతున్నాయి. వచ్చే మార్చి నాటికి స్టెంట్ ధరపై పరిమితి ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సరికే ఈ ప్రాణరక్షక ఔషధాన్ని పరికరం డిపిసిఒ జాబితాలో ఎందుకు చేర్చలేదని కోర్టు సంజాయిషీని కూడా కేంద్రంనుంచి కోరింది. 2015లో సాంగ్వాన్ పిల్ దాఖలు చేశాక గత జూలై 19న స్టెంట్లను జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చారు. అటువంటి ఉత్తర్వు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆ పిల్ కోరింది. ప్రభుత్వం మాత్రం స్టెంట్లను పిపిసిఒ జాబితాలో చేర్చకుండా జూలైనుంచి తాత్సారం చేస్తోంది. కానీ, ప్రస్తుతం ఆ జాబితాలో చేర్చడం అయ్యింది కనుక ఈ అంశం ఎన్‌పిపిఎ వద్ద ఉంది. ఇక స్టెంట్లకు హేతుబద్దమైన ధర నిర్ణయం జరగాల్సి ఉంది.
స్టెంట్ అన్నది చిన్న వైర్ మెష్ ట్యూబు (తీగ జాలీ గొట్టం). ధమనులలో రక్త ప్రసరణకు ఏర్పడిన అడ్డంకులను ఛేదించడం కోసం అమర్చుతారు. గుండెలోని మూసుకుపోయిన ధమనిని తెరచి ఉంచుతుంది. పాతతరంలో మెటల్ స్టెంట్‌ను అమర్చేవారు. కొత్తగా మందులను విడుదల చేసే స్టెంట్లు వచ్చాయి. రక్త ప్రసరణ అడ్డంకులు ఇక ముందు ఏర్పడకుండా గుండె ధమనులను స్టెంట్ రక్షిస్తుంది.
కనీస గరిష్ఠ ధర అధికం
దేశంలో ఏటా 2లక్షల16వేల స్టెంట్లను వాడుతున్నారు. ఇందులో 76శాతం మందుల స్టెంట్లు. హృద్రోగ నిపుణులు యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా స్టెంట్లను అమర్చుతారు. వీరికి ఒక జాతీయస్థాయి మండలి కూడా ఉంది. స్టెంట్లను ఉత్పత్తి చేసే వారి గురించి ఎన్‌పిపిఎ ఒక నివేదికలో వివరించింది. ఒక స్టెంటు ఉత్పత్తి వ్యయం, రవాణా ఇతర ఖర్చులు కూడా కలుపుకొని గరిష్ఠ చిల్లర ధర చివరకు తడిసి మోపెడు అవుతుంది. మహారాష్ట్ర ఆహార ఔషధ యంత్రాంగం 2015 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో వాటి ధరలను వివరించింది. మంచి గిరాకీ ఉన్న బ్రాండ్ స్టెంటు ధర రూ.40,710 తిరిగి ఆసుపత్రి ద్వారా లక్షా20వేలు కూడా చేరుతుంది. బహుళాజాతి కంపెనీలు ఈ స్టెంట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో ఎబౌట్‌మెడ్‌ట్రానిక్స్, బోస్టన్ సైంటిఫిక్ కంపెనీలు రూడా ఉన్నాయి. వాటి ఉత్పత్తులన్నీ కలిపితే దేశంలోని మార్కెట్ వాటాలో 60శాతం దాకా ఉంటుంది. ఎబౌట్ స్టెంటు ధరలో వ్యత్యాసాలు ఉన్నాయి. గరిష్ఠ ధరకు , ల్యాండెడ్ ధరకు మధ్య 294 శాతం నుంచి 740 శాతం తేడాలు ఉంటాయి. మిగతా బ్రాండ్ల స్టెంట్ల ధరల్లో ఈ వ్యత్యాసం 464 శాతం నుంచి 1200శాతం దాకా ఉంటుందని ఎన్‌పిపిఎ తెలిపింది.
ధరలపై వేర్వేరు వాదనలు
స్టెంట్లను ప్రభుత్వాసుపత్రులు టోకు ధరకు పెద్ద సంఖ్యలో కొంటాయి. కొన్ని స్టెంట్లు విదేశీ ఔషధాలను విడుదల చేస్తాయి. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్‌ఎస్) కింద కేంద్ర ఉద్యోగులకు స్టెంట్ల శస్త్ర చికిత్స చేస్తారు. ఆరోగ్యశాఖ నిర్ణయించిన ధర వాటికి వర్తిస్తుంది. దానిని స్టెంటు ఒక్కింటికి రూ.23,675గా ప్రతిపాదించారు. ఔషధ పరికరాల ఉత్పత్తిదారుల సంఘం ‘అడ్వామెడ్’ ప్రభుత్వం ఇలా ధరను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నది. ఈ మేరకు ఆ సంఘం విడుదల చేసిన ప్రకటనలో“మందులను విడుదల చేసే అన్నిరకాల స్టెంట్లను ఒకే గాటకు కట్టడం ఈ పరికరాన్ని అభివృద్ధి చేయడానికి చోటు చేసుకున్న శాస్త్ర, సాంకేతికపరమైన పురోగతిని వెక్కిరిస్తోంది. అందుకు ఎన్నో ఏళ్లు పట్టింది. సరిగా ప్రయోగాలు జరగని బ్రాండ్ల స్టెంట్లను, జరిగిన స్టెంట్లను కలిపి ధర నిర్ణయించడం అపసవ్యం. పైగా స్టెంట్లను అమర్చే ప్రక్రియ కొందరు రోగులకు అతికష్టంగా జరగవచ్చు. అందుచేత ఒకేవిధంగా ధర నిర్ణయించడం సరికాదు” అని వాదించింది. భారత హృద్రోగ నిపుణుల సంస్థ (సిఎస్‌ఐ) అధ్యక్షులు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎం.ఎస్.హిరెమత్ ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరిపినట్టు చెప్పారు. స్టెంట్లన్నింటికీ గుదిగుత్తగా ఒకే ధర నిర్ణయించ కుండా వేరువేరు ధరలు ఉండాలని ప్రతిపాది ంచినట్లు తెలిపారు. ఎందుకంటే, మందులను విడుదల చేసే స్టెంట్లలో వేరువేరు రకాలు ఉంటాయి. ఆ స్టెంట్ల తరం బట్టి ధర నిర్ణయించాలని ప్రభుత్వానికి ఆయన సూచిం చారు. వైద్య రంగానికి చెందిన మరో సామాజిక కార్యకర్త మాలిని -“ ఏ రకం స్టెంటు మంచిదో తెలిపే సమాచారం ఏదీ లేదు.అందువల్ల ఏ స్టెంటు ఏ రకం రోగిపై ఎటువంటి ఫలితాలు ఇవ్వగలదో ఊహించలేం. మనదేశంలో స్థానికంగా తయారైనస్టెంట్ల కంటే దిగు మతి అయిన స్టెంట్లకు ధర అధికంగా ఉంది. గిరాకీ కూడా ఎక్కువ. మనం వాడే స్టెంట్లలో 75శాతం దిగు మతి చేసుకున్నవే” అని వివరించారు. మొత్తానికి ఎప్పటి నుంచో వాడకంలో ఉన్న స్టెంట్ల ప్రక్రియకు ఢిల్లీ హైకోర్టు పెద్ద కుదుపు తెచ్చింది. మొదటిసారిగా ఇవి ధరల పరిమితి చట్రంలోకి రాబోతున్నాయి.

– ఎస్‌ఎస్