Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మంజులాపూర్‌లో కార్డన్

Cardon in Manzalapur

సరైన పత్రాలు లేని 103 ద్విచక్ర వాహనాలు,

3 ఆటోలు,

2కార్లు,

1 టాటా ఎసి వ్యాన్ ,

50 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్:  నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం వేకువజామున జిల్లా ఎస్‌పి శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో పెద్ద ఎత్తున సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు దొరికాయి. వీటితో పాటు ఆ టోలు, కార్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు..వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామంలో ఎస్‌పి శశిధర్‌రా జు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ వేకువజామున  నుంచి 8 గంటల వరకు కొనసాగింది. ఈ తనిఖీల్లో  డిఎస్‌పి మనోహార్‌రెడ్డితో పాటు నాలుగురు సిఐలు, 10 మంది ఎస్‌ఐలు, 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 3 ద్విచక్ర వాహనాలు, 3ఆటోలు, 2 కార్లు, 1 టాటా ఎసివ్యాన్‌ల తో పాటు సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక, బీర్ కార్టన్‌లు, గుట్కా ప్యా కెట్లు దొరికినట్లు  పోలీసులు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్‌పి  మాట్లాడుతూ సుమారు 3 గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు భారీ సంఖ్యలో దొరికాయని, వాటితో పాటు 3ఆటోలు,2 కార్లు,50 ట్రాక్టర్ల ఇసుక డం ప్,నిషేదిత గుట్కా ఫ్యాకెట్లు లభించినట్లు వాటిని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

comments