Home తాజా వార్తలు మీర్ పేట్ లో నిర్బంధ తనిఖీలు

మీర్ పేట్ లో నిర్బంధ తనిఖీలు

telangana-police

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లోని నందనవనంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎల్బి నగర్ డిసిపి వెంకటేశ్వర్ రావు, 200 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పాత నేరస్తులు, ముగ్గురు రౌడీషీటర్లను అరెస్టు చేశారు. 15 మంది అనుమానాస్పద వ్యక్తులను  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.