Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బుమ్రాకు కెరీర్ ఉత్తమ ర్యాంక్

cricketదుబాయి : వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పరిమిత ఓవర్ల క్రికెట్లో రికార్డులు సృష్టిస్తున్న భారత యువ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో వన్డే, టి-20 సిరీస్‌లను భారత్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా..తాజాగా ఐసిసి ప్రకటించిన టి-20 ర్యాంకింగ్స్ జాబితాలో బుమ్రా ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలో వెస్టిండీస్ బౌలర్ శ్యామ్యూల్ బద్రీ 744 పాయింట్లతో ఉన్నాడు. బుమ్రా అతని కంటే 46 పాయింట్లు తక్కువగా ఉన్నాడు. టాప్-10లో భారత్ తరఫున అశ్విన్ 670 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి 837 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ 803 పాయింట్లతో ఉన్నాడు.

Comments

comments