Home వార్తలు జడేజాకు కెరీర్ బెస్ట్ ర్యాంక్

జడేజాకు కెరీర్ బెస్ట్ ర్యాంక్

Untitled-6666దుబాయి : భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ఐసిసి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ దక్కింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 12 వికెట్లు(మూడు ఇన్నింగ్స్‌ల్లో) పడగొట్టిన జడేజా తాజాగా బుధవారం విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. మరో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఐదోస్థానంలో, పేసర్ ఇశాంత్‌శర్మ 20వ స్థానంలో కొనసాగుతున్నారు. అగ్రస్థానంలో సఫారీ పేసర్ డేల్‌స్టెయిన్ నిలబెట్టుకోగా, కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆసీస్ స్పీడ్‌స్టార్ మిచెల్ జాన్సన్‌కు తొమ్మిదోస్థానం లభించింది. ఇక బ్యాట్స్‌మెన్‌ల ర్యాంకింగ్స్‌లో భారత్ తరుపున మురళీవిజయ్(12), పుజారా(12), కోహ్లి(17) మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకోగా, అగ్రస్థానంలో ఏబీ డివిల్లియర్స్, రెండు మూడు స్థానాల్లో వరుసగా కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లు నిలిచారు.