Home బిజినెస్ మగువల మనసు దోచే కార్లు

మగువల మనసు దోచే కార్లు

carsఏయేటికాయేడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొత్త కార్లు మార్కెట్లోకి అడుగుపెడుతూనే ఉన్నాయి. వివిధ కంపెనీలు పోటీపడుతూ ఆధునాతన ఫీచర్లు, డిజైన్లతో కార్లను తయారుచేస్తూ, విడుదల చేస్తున్నాయి. అయితే, వీటిలో కొన్ని కార్లు బాగా పేరు పొందుతున్నాయి. దీంతో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
మరికొన్ని ప్రజల మననలను పొందలేకపోతున్నాయి.
ఇవి మార్కెట్‌లో కనిపించకుండాపోతున్నాయి. అయితే, దీనికి కారణమేమింటే.. .కార్ల డిజైన్, మైలైజ్ తదితర విషయాలు నచ్చకపోవడమనేది చెప్పవచ్చు. అయితే, ఆటోమొబైల్ తయారీదారులు మాత్రం ఎంతో సమయం వెచ్చించి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎప్పటికప్పుడు కొత్త కార్లను తయారుచేస్తూనే ఉన్నారు. అయితే, ఇది ఎంతోశ్రమతో కూడుకున్నదని చెప్పాలి. ఎందుకంటే ఇది అంత సులభం కాదు. ఒక కారు తయారీ చేయడానికి చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం కనుక. అయితే, ఇక్కడ అసాధారణమైన, విలాసవంతమైన ప్రపంచవ్యాప్త బ్రాండ్ల ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది మహిళలు మెచ్చే, కొన్ని టాప్ కార్ల గురించి తెలుసుకుందాం.

లంబోర్గిని
ఇటీవలకాలంలో లంబోర్గిని ఎంతో అద్భుత డిజైన్‌తో తయారుచేసిన హురకెన్ సూపర్ కార్, అవెంతడోర్ అనే రెండు మోడళ్లు విడుదలయ్యాయి. లంబోర్గిని ఈ రెండు కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి, కొనుగోళ్లదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రెండు కార్లలో ఎక్కువ మంది మహిళలు లంబోర్గిని సూపర్ కార్‌ను ఇష్టపడుతున్నారు. మిగతా అన్ని సూపర్ కార్లతో పోలిస్తే లంబోర్గిని సూపర్ ఎంతో ఉత్తమమని పేర్కొనట్లు సమాచారం. దీనిని ఎంతో అద్భుతమైన డిజైన్, ఎక్కువ వేగంతో నడిచేలా రూపొందించినట్లు తెలిసింది.
ఫెరారి జిటిఒ
మహిళలు కచ్చితంగా ఎరుపు రంగు బుగాటి కార్లను ఇష్టపడతారు. అదే మరి ఫెరారి జిటిఒ మోడల్ ఉందంటే వారి ఆశకు హద్దులే ఉండవు మరి. అయితే, దీనిని మహిళలు, పురుషులతో పోటి పడి మరి దక్కించుకుంటున్నారు. ఎందుకంటే దీనిని మహిళలు, పురుషులను ఇద్దరిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. కాని ఏ మహిళ కూడా దీనిని వదులుకోలేదు. ఎందుకంటే, ఈ ఫెరారి జిటిఒ అంత బాగుంటుందని చెప్పవచ్చు.
బిఎమ్‌డబ్లు ఎమ్6 క్యాబ్రియోలెట్
మహిళలు ఎక్కువగా రూఫ్ లేని కార్లను ఉపయోగిస్తారు. ఎందుకంటే సూపర్ కార్ అని చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గమై ఉండవచ్చు. దీనికి బిఎమ్‌డబ్లు నుంచి వచ్చిన ఎమ్6 క్యాబ్రియోలెట్‌ను ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఫాస్ట్ కారు, పైకప్పు ఓపెన్‌లో, జట్టు గాలిలో ఎగురుతూ ఉంటే నిజంగా మంచి ప్రశాంత వాతావరణంలో ఉండే అనుభూతిని కలిగిస్తుంది. అదేవిధంగా దీనిలో ప్రయాణం చేసేటప్పుడు గాలి ఎగిరేలా అనిపిస్తుంది.
మసెరటి
మంచి డిజైన్‌తో తయారుచేసిన ఇటాలియన్లు తయారుచేసిన కారు చాలా అందంగా, ఆకర్షణంగా నిలుస్తుంది. ఈ కారును చూడగానే వాహ్…. ఎంతో బాగుంది అనే విధంగా దీనిని రూపొందించారు. ఇతర కార్ల కంటే ఈ కారు అన్ని విషయాలలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. దీనిలో గల స్మూత్ లైన్‌లు, చక్కని డిజైన్ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. దీని బాహ్య నిర్మాణం ఎంతో సున్నితంగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువ మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. ఈ కారు మహిళలకు చాలా హుందాతనాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఫోర్బ్
ఫోర్బ్‌కార్లు దాదాపుగా ఒక విధమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. అందుకు నిదర్శనం సూపర్ కార్లు ఫోర్బ్‌తన సూపర కార్ల తరహాలోనే మిగిలిన అన్ని రకాల మోడల్స్ ఉంటాయి. అయితే, డిజైన్‌పరంగా వాటి మధ్య కేవలం అతి తక్కువ మార్పులతో తయారుచేశారు. అయితే, దీనిని ఇంజిన్ సౌండ్ పరంగా మంచి వాహనం అని చెప్పవచ్చు. ప్రస్తుతం మహిళలు పోర్సే ఇచ్చే శబ్దం గల కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
కాడిల్లాక్ ఎల్‌డోరాడొ
మంచి లుక్‌నిచ్చే కారు అంటే కాడిల్లాక్ ఎల్‌డోరాడా అని చెప్పవచ్చు. అందుకే ఎక్కువ మంది మహిళలు దీనిని ఇష్టపడుతున్నారు. ఎన్ని కొత్త డిజైన్స్ వస్తున్నప్పటికి దీనికున్న డిమాండే వేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ కారు లుక్ అదిరేలా ఉంది. ఇందులో ప్రయాణం మహిళలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కనుక, మహిళలు ఈ కారును ఇష్టపడుతున్నారు.
బుగాటి వేరాన్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరుగాంచిన ఎక్సోటిక్ సూపర్ కార్ బుగాటి వేరాన్ అని చెప్పవచ్చు. దీనిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. అయితే, పరిమితంగా అందుబాటులోకి తేవడం వలన దీనికి విపరీతమైన కొరత ఏర్పడింది. మహిళలు ఇతరులు వాడిన వాటిని వాడరు. అవి బట్టలు కాని ఇంకా ఏవైనా ఇతర వస్తువులు కావచ్చు. అవి వారికోసం మాత్రమే తయారుచేసినట్లుగా భావిస్తారు. ఈ కారు కొనడంలో బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు.
జీప్ రాంగ్లర్

ఈ మధ్య ఎక్కువ మంది మహిళలు ఆఫ్-రోడ్ వాహనాలను ఇష్టపడుతున్నారు. కేవలం ఆఫ్-రోడ్ వాహనాలనే కాదు ఒపెన్ టాప్ వాహనాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
వాంగ్లర్ జీప్ ఇప్పటి వాహనం కాదు, కాని దీనిని బాగా ఆధునీకరించిన తరువాత మార్కెట్‌లోకి విడుదల చేశారు.
అయితే, ఈ కారు డిజైన్ మెచ్చిన ఎక్కువ మంది మహిళలు దీనిని ఇష్టపడుతున్నట్లు తెలిసింది.
ఈ కారు ఒపెన్ టాప్ ఉండడం వలన మంచి చల్లగాలి వాతావరణంలో ప్రయాణించినప్పుడు చాలా విలాసవంతం, ఉత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు.