Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నా కెరీర్ ముగిసిపోయినట్టే

narsinghన్యూఢిల్లీ : డోపింగ్ కేసులో తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని పునఃసమీక్షించకపోతే ఇక కెరీర్ ముగిసిపోయినట్లేనని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు(సిఎఎస్) తీర్పును పునఃసమీక్షించకపోతే నా కెరీర్ ముగిసినట్లే. ఈ నిషేధం అనేది కేవలం నా ఒక్కడికే పరిమితం కాదు.. యావత్ దేశానికే సంబంధించింది. నా కేసును సమీక్షించడానికి దేశంలోని పెద్దలు చొరవచూపకపోతే ఓ అమాయకుడు బలవుతాడు’ అని నర్సింగ్ ఆవేదన వక్తం చేశాడు. ఈ డోపింగ్ ఉదంతంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని నర్సింగ్ మరోసారి పేర్కొన్నాడు. సాయ్, నాడా అధికుల జోక్యం : నర్సింగ్ యాదవ్‌పై జరిగిన డోపింగ్ కుట్రలో కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ డోపింగ్ నిరోధక సంఘం(నాడా) జూనియర్ అధికారుల జోక్యం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ ఆరోపించారు. నర్సింగ్ నాలుగేళ్లు నిషేధం పడడంలో వీరికి పాత్ర ఉందని ఆయన అన్నారు. ‘రియోలో సిఎఎస్ విచారణ సందర్భంగా మాకు కొన్ని విషయాలు తెలిశాయి. స్వల్ప వ్యవధిలోనే నర్సింగ్‌కు రెండుసార్లు డోప్ టెస్ట్ ఎందుకు నిర్వహించారని నాడాను వాడా ప్రశ్నించింది. సాయ్ సోనేపత్ కేంద్రంలో డ్రగ్స్ తీసుకుంటున్నారని అక్కడి అధికారొకరు జులై 4న తమకు లేఖ రాశారని సాయ్ తెలిపిందని’ బ్రిజ్ భూషన్ తెలిపారు. ‘లేఖలోని ఫిర్యాదుతో రెండోసారి డోప్ పరీక్ష నిర్వహించారు. జూన్ 25న డోప్ పరీక్ష సమయంలో నర్సింగ్ ఆహారంలో ఉత్ప్రేరకాలు కలిపిన వారు సరిగ్గా కలిపామో లేదో అన్న మీమాంసతో జులై 4న డోప్ పరీక్ష నిర్వహించాలని నాడాకు మళ్లీ లేఖ రాశారని’ సింగ్ తెలిపారు. ఈ లేఖ రెజ్లింగ్ సమాఖ్య వద్ద కూడా ఉందని ఆయన తెలిపారు. రియోలో సిఎఎస్ విచారణ సమయంలో ఇది తమ వద్ద ఉండుంటే తమ వాదనకు మరింత బలం చేకూరేదన్నారు. ‘నాడా సైతం ఈ లేఖ గురించి ముందుగా మాతో చెప్పలేదు. ఈ కుట్రలో తప్పకుండా నాడా, శాయ్ జూనియర్ అధికారుల జోక్యం ఉందని’ ఆయన అన్నారు.

Comments

comments