Home జాతీయ వార్తలు నలుగురు ఆప్ ఎంఎల్‌ఎలపై కేసు

నలుగురు ఆప్ ఎంఎల్‌ఎలపై కేసు

AAP-1

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్‌సింగ్ గుప్తాపై దాడి చేసిన ఘటనలో నలుగురు ఆప్ ఎంఎల్‌ఎలపై కేసు నమోదైంది. జర్నైల్ సింగ్, అఖిలేష్ త్రిపాఠి, జితేందర్ తోమార్, సంజీవ్ ఝూ అనే ఆప్ ఎంఎల్‌ఎలపై కేసు నమోదు చేసినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. ఢిల్లీ బిజెపి ప్రధానకార్యదర్శి రవీందర్ గుప్తా ఫిర్యాదుతో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన బిజెపి ప్రతినిధి బృందంపై ఆప్ ఎంఎల్‌ఎలు దాడి చేశారని ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా ఆరోపించిన విషయం తెలిసిందే. అక్రమ వాణిజ్య సంస్థలను సీల్ చేస్తున్న అంశంపై సిఎం కేజ్రీవాల్‌తో చర్చించేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగిందని విజేందర్ గుప్తా చెబుతున్నారు. దాడికి పాల్పడిన ఆ నలుగురు ఆప్ ఎంఎల్‌ఎలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Case Against four AAP MLAs