Home తాజా వార్తలు రేవంత్‌రెడ్డిపై కేసు

రేవంత్‌రెడ్డిపై కేసు

Revanth-Reddy

మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిపై మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టిఆర్‌ఎస్ ఫౌండర్స్ ఫోరం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి వాడిన పదజాలం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Case Against Revanth reddy