Search
Sunday 23 September 2018
  • :
  • :

వైర‌ల్ సాంగ్‌పై ముస్లింల కంప్లైంట్

MANORAMA-SONG

మలయాళం సినిమా ‘ఓరు అదార్ లవ్‌’లోని ‘మానిక్యా మలారాయ పూవి’ అనే పాట లోని క్లిప్ ఎంత వైర‌ల్‌గా మారిందో తెలిసిందే… వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకాళ్లు కట్టిపడేసింది. ప్ర‌తి ఒక్క‌రు ఈ వీడియోని షేర్ చేస్తూ త‌మ ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. మలయాళం సినిమా సాంగ్ మానిక్యా మలారాయ పూవి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. అయితే ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ ముస్లింల మ‌నోభావాలని అగౌర‌వ‌ప‌రిచేలా ఉన్నాయంటూ కొందరు యువ‌కులు హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లిం యువ‌కులు ఎలాంటి ప్రూఫ్ స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని ఫ‌ల‌క్‌నుమా ఎసిపి స‌య‌ద్ ఫ‌య‌జ్ తెలిపారు.

Comments

comments