Home సినిమా శ్రీరెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జీవిత ఫిర్యాదు

శ్రీరెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జీవిత ఫిర్యాదు

jivitha-sriredddy

మన తెలంగాణ/ హైదరాబాద్ / పంజాగుట్ట: నటి శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకురాలు, నటి జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం  జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త రాజశేఖర్‌తో పాటు తనను అవమాన పరిచేలా మాట్లాడిందని , ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇన్‌స్పెక్ట ర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదును అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరెడ్డి లేని పోనీ ఆరోపణలు చేస్తూ, నిజాయితీగా వ్య వహరిస్తున్న తమ దంపతులను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మా ట్లాడిందన్నారు. చవకబారు ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి , కేవలం చీప్ పబ్లీసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, తన కుటుంబం గు రించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసన్నారు.