Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

లౌడ్ స్పీకర్ వినియోగించారని రాహుల్ గాంధీపై కేసు!

RAHULన్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రహ్మ స్వరూప్ బ్రహ్మచారి అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హరిద్వార్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, హరీశ్‌రావత్ నిర్వహిస్తున్న రోడ్ షో కొనసాగింది. రాత్రి పది గంటల సమయంలో లౌడ్ స్పీకర్లను వినియోగించారు. దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Comments

comments