Home తాజా వార్తలు కానిస్టేబుళ్లపై కేసు నమోదు

కానిస్టేబుళ్లపై కేసు నమోదు

police-cap

హైదరాబాద్ : మాదాపూర్‌లో మహిళను బెదిరించి ఎనిమిది లక్షల పాత నోట్లను దోచుకున్న ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లను పోలీసులపై కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి మాదాపూర్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ కారును తనిఖీ చేసిన క్రమంలో పది లక్షల పాత నోట్లు లభ్యమయ్యాయి. దీంతో అక్కడ తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్లు విక్రమ్‌రెడ్డి, ధన్‌సింగ్, పవన్‌ను ఆ మహిళను బెదిరించారు. పాత నోట్లు కలిగి ఉండడం నేరమని, జైలు శిక్ష పడుతుందని ఆమెను బెదిరించారు. ఎనిమిది లక్షల పాత నోట్లను వారు ఆమె వద్ద నుంచి తీసుకున్నారు. మిగిలిన రెండు లక్షల నోట్లను ఆమెకిచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున బాధితురాలు మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు నగదు తీసుకోవడం నిజమేనని పోలీసులు  నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు.