Search
Sunday 18 November 2018
  • :
  • :

గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీపై కేసు నమోదు

Gerdau

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై కేసు నమోదైంది. యాజమాన్యం సెప్టీ మెజర్స్ పాటించకపోవడంతో సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగింది. కంపెనీపై రాయల్టీ ఎగవేత కేసులు నమోదు చేశారు. అనుమతి లేని ఖనిజాన్ని వినియోగిస్తున్నారని, స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి స్థానిక నేతలు అండగా ఉన్నట్టు కార్మికులు ఆరోపణలు చేశారు. ఫ్యాక్టరీ లోపల జరిగేదంతా మిస్టరీ అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గురువారం సాయంత్రం ఫ్యాక్టరీలో కార్బన్‌ మోనాక్సైడ్‌ అనే విషవాయువు లీక్ కావడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments