Home తాజా వార్తలు మెడికల్ సీట్ల కుంభకోణంపై కేసు నమోదు

మెడికల్ సీట్ల కుంభకోణంపై కేసు నమోదు

ACB Trapped Senior Assistant

హైదరాబాద్: తెలంగాణ స్పోర్ట్ కోటా మెడికల్ సీట్ల కుంభకోణంపై కేసు నమోదైంది. గత ఏడాది మెడికల్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. స్పోర్ట్ కోటాలో ఉన్న నాలుగు సీట్లను అమ్ముకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. హబ్సిగూడ, ఎల్బిస్టేడయం, రామంతాపూర్, నాగోల్ తో సహా ఐదు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.