Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

శంకర్‌నాయక్‌పై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలి

Revanth-Reddyహైదరాబాద్ : మహుబూబాబాద్ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శంకర్‌నాయక్‌ను పార్టీ నుంచి బహిష్కరించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు సూచించారు. మహబూబాబాద్‌లో జరిగిన అంశంపై వివరాలు తెలుసుకోవాలని డిప్యూటీ సిఎంను, ఎంపిని సిఎం కెసిఆర్ పురమాయించడం అన్యాయమన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

Case should be filed under Nirhaya act on MLA Shankar Nayak

Comments

comments