Search
Friday 21 September 2018
  • :
  • :

నగదు రహిత జిల్లాగా మంచిర్యాల

Collector1

మంచిర్యాలప్రతినిధి: నిర్దేశిత లక్ష్యాల మేరకు గ్రామాలను గణతంత్ర దినోత్స వంలోగా నగదు రహిత ఆర్దిక లావాదేవీల నిర్వాహణకు గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నగదు రహిత ఆర్దిక లావాదేవీల నిర్వ హణ, రబీ పంట రుణాలు,వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న స్వయం ఉపాధి రుణాల ప్రగతిపై బ్యాంక ర్లు, వివిధ సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ నీతి వంతమైన సమాజ  నిర్మాణంలో నగదు రహిత ఆర్దిక లావాదేవీలను ప్రోత్సహించుటకు బ్యాంకర్లు అధికంగా కృషి చేయా లని,మండలాల వారిగా ఎంపిక చేసిన గ్రామాలలో డిజిటల్ బ్యాంకింగ్‌ను పూర్తి స్దాయిలో నిర్వహిం చేందుకు స్దానిక మండలాల అధికారులకు సహకరించి వారు కోరిన విధంగా పిఓఎస్ మిషన్‌లను అందించాలని,నూతనంగా బ్యాంకు ఖాతాలేని వారికి బ్యాంకు ఖాతా తెరిచి ఎటిఎం కార్డులను అందించి వాటి వాడకం పై ప్రజలలో చైతన్యం చేయాలని అన్నారు.

అదేవిధంగా రబీ కాలంలో వివిధ బ్యాం కులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రైతులకు సకాలంలో పంటరుణాలు అందించాలని అలాగే ఎస్సీ,ఎస్టీ,బిసి సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్న స్వయం ఉపాధి రుణాలను ఆలస్యం చేయకుండా త్వరగా అందించుటకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ జె సుధాకర్ రావు,సిపిఓ సత్యనారాయణ రెడ్డి,బిసి సంక్షేమ అధికారి ఖజానిజాం అలీ అప్సర్,జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి గంగారం,లీడ్ బ్యాంకు మేనేజర్ రాజారాం,ఆంద్రబ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం,బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ పరిధిలో మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయాలి

ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ మచిర్యాల మున్సిపాలిటి అధికారులను ఆదేశించారు. గురు వారం జిల్లా కలెక్టర్ మంచిర్యాల పట్టణంలోని వార్డు నెంబర్ 2 వడ్డెర కాలనీలో ఆకస్మికంగా పర్యటించి కాలనీలో వ్యక్తి గత మరుగుదొడ్లపై కాలనీ వాసులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కాలనీ అంతటా తిరిగి మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ బహిరంగ మల, మూత్ర విసర్జన లేని సమాజంగా తీర్చిదిద్దడంలో భాగంగా మంచిర్యాల పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణమును 10 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ అధికారులు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్గిస్తూ వారు వ్యక్తి గత పరిశుభ్రత పాటించేలా , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. కాలనీలో నివసించు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన ప్రభుత్వం తరపున మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని వడ్డెరకాలనీ 108 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోగా వాటిలో 74 మరుగుదొడ్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయని,వీటితో పాటు మిగతా మరుగుదొడ్లను 10 రోజుల్లోగా నిర్మాణం పూర్తి చేసి, లబ్దిదారులకు అందించాలని మున్సిపల్ కమీషనర్ వెంకన్నకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేక అధికారి ఎడిమైన్స్ విజయ్‌కుమార్‌రాథోడ్, మున్సిపల్ డిఇ గంగాధర్ ఉన్నారు.

Comments

comments